మలికిపురం: మాజీ మంత్రి జయంతి సందర్బంగా ఘనంగా నివాళి

52చూసినవారు
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి సఖినేటిపల్లి మండలం గుడిమూలకు చెందిన రుద్రరాజు రామలింగరాజు 109వ జయంతి మల్కిపురం మండలం లక్కవరం గ్రామ పంచాయతీలో శనివారం జరిగింది. పీసీసీ సభ్యులు రుద్రరాజు గోపాలకృష్ణరాజు మాజీ మంత్రి రామలింగరాజు చిత్ర పటానికి పూల మాలవేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర మంత్రిగా, రాష్ట్ర కో-ఆపరేటివ్ ఛైర్మన్ గా పనిచేసి రామలింగరాజు ఈ ప్రాంతం అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్