పంట బోదేలో పడి వ్యక్తి మృతి
అంబాజీపేట మండలంలోని ముక్కామల గ్రామంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తికి ఫిట్స్ రావడంతో పంట బోధిలో పడి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. దీనిపై అంబాజీపేట ఎస్సై కే. చిరంజీవి ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం పసుపల్లికి చెందిన బొక్క వెంకటేశ్వరరావు (48) బైక్ పై ముక్కామల వెళ్తుండగా ఫిట్స్ రావడంతో పక్కనే ఉన్న పంట బోదేలోకి దూసుకుపోయాడు. దీంతో అక్కడిక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసామన్నారు.