పేకాట స్థావరాలపై పోలీసుల దాడి
రాజోలు మండలం శివకోడు, మెరకపాలెం గ్రామాల్లో పేకాట స్థావరాలపై దాడిచేసినట్లు రాజోలు ఎస్ఐ రాజేష్ కుమార్ ఆదివారం తెలిపారు. పక్కా సమాచారంతో దాడి చేసి రూ. 3,350 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామని వివరించారు. రాజోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, ఉపేక్షించేది లేదని ఎస్ఐ హెచ్చరించారు.