జగ్గయ్యపేట: డప్పు కళాకారులకు పెన్షన్ 10 వేల రూపాయలు ఇవ్వాలి
పెరిగిన నిత్యవసర వస్తువులకు అనుగుణంగా డప్పు కళాకారులకు పెన్షన్ ను 10 వేల రూపాయలు ఇవ్వాలని డప్పు కళాకారుల సంఘం జిల్లా కార్యదర్శి ఎం కుటుంబరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగ్గయ్యపేటలోని డివిఆర్ నగర్ లో గల సుందరయ్య భవన్ లో ఆదివారం జగ్గయ్యపేట మండలం డప్పు కళాకారుల సంఘం సమావేశం కెవిపిఎస్ నాయకులు జె వెంకటరావు అధ్యక్షతన జరిగింది.