కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో వ్యవసాయ కూలీ మృతి చెందిన సంఘటన జగ్గయ్యపేట నియోజకవర్గంలో చోటుచేసుకుంది. మంగళవారం తొర్రగుంటపాలెం చెందిన రేమల్లె కోటేశ్వరావు వ్యవసాయ పనులు చేసుకొని తిరిగి వస్తున్న సమయంలో తిరుమలగిరి రోడ్డు సమీపంలో కారు అతి వేగంగా వచ్చి ఢీకొనటంతో సంఘటన స్థలంలోనే దుర్మరణం పాలయ్యాడు. జగ్గయ్యపేట పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.