పాలకొల్లు: చిన్నారులతో సెల్ఫీ దిగిన మంత్రి
కార్తీకమాసం సందర్భంగా. పోడూరు మండలం పెనుమదం గ్రామంలో జరిగిన కాపు, బలిజ, ఒంటరి వన సమారాధన కార్యక్రమంలో పాలకొల్లు ఎమ్మెల్యే, రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాపు, బలిజ, ఒంటరి నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వన సమారాధనలో మంత్రి నిమ్మల చిన్నారులతో సరదాగా సెల్ఫీలు దిగారు. అనంతరం వారితో కలిసి సంపక్తి భోజనాలు చేశారు.