నాణ్యమైన ఆయిల్‌తో తయారు చేసిన వంటకాలను ప్రజలకు విక్రయించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. శనివారం తాడేపల్లిగూడెం పురపాలక సంఘ సమావేశ మందిరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారులు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఆర్డీవో ఖతీబ్ కౌసర్ బనో పాల్గొన్నారు.