తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న 51 చౌక దుకాణాలకు డీలర్ల నియామకానికి రాత పరీక్ష ఆదివారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు ఆర్డీవో ఖతీబ్ కౌసర్ బనో తెలిపారు. శనివారం సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడారు. 174 మంది దరఖాస్తు చేసుకోగా, 142 మందిని రాత పరీక్షకు అర్హులుగా ఎంపిక చేసినట్లు వివరించారు. వారందరికీ ఆదివారం ఉదయం జెడ్పీహెచ్ లో పరీక్ష జరుగుతుందన్నారు.