గుంటూరు: పాగగంటి చైతన్యకు వైద్య పరీక్షలు
వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడిన కేసులో ఏ1 ముద్దాయి పానుగంటి చైతన్యను సీఐడీ పోలీసులు కస్టడీకి కోరగా కోర్టు అనుమతి ఇవ్వడంతో జిల్లా జైలు నుంచి అధికారులు నేరుగా శుక్రవారం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అత్యవసర వైద్య సేవల విభాగంలో అతడికి రక్తపోటు, మధుమేహం, తదితర వైద్య పరీక్షలు చేశారు. ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు నిర్ధారించడంతో చైతన్యను పోలీసులు సీఐడీ కార్యాలయానికి తరలించారు.