పిడుగురాళ్ల , మాచవరం మండలాల సిపిఎం పార్టీ సభ్యుల జనరల్ బాడీ సమావేశం బుధవారం పిడుగురాళ్ల కన్నె గంటి హనుమంతు భవనంలో జరిగింది. ముందుగా ఇటీవల మరణించిన సిపిఎం ఆల్ ఇండియా కార్యదర్శి కామ్రేడ్ సీతా రామ్ ఏచూరి, ప్రొఫెసర్ సాయిబాబాకు సంతాపం తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల గురించి వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ కంపెనీలకు దోచి పెట్టే విధానాలను అవలంబిస్తుందని విమర్శించారు.