డైరెక్టర్ గుణశేఖర్ ఇంట పెళ్లి సందడి
ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. గుణశేఖర్ కుమార్తె నీలిమ నిశ్చితార్థం వేడుక హైదరాబాద్ లో చోటుచేసుకుంది. భాగ్యనగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో రవి ప్రక్యాతో నీలిమ నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. కాబోయే భర్తను పరిచయం చేస్తూ నీలిమ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ను షేర్ చేసింది.