రైల్వే కోడూరు నియోజకవర్గంలో శ్రీరామనవమి జరిగే అన్ని గ్రామాలలో పోలీసుల ముందస్తు అనుమతి తప్పనిసరి అని ఆదివారం రైల్వే కోడూరు గ్రామీణ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. గ్రామాలలో ఉత్సవాలు జరిగే సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రక్షణ కల్పించేందుకు మాత్రమే ముందస్తు అనుమతులు అని ఆయన తెలిపారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు ప్రకటన విడుదల చేసినట్లు ఆయన తెలిపారు.