దివ్యాంగ బాలుడికి పెన్షన్ మంజూరు చేయించండి
తల తప్ప శరీరంలో ఏ భాగము కదిలించలేని దివ్యాంగ బాలుడికి పెన్షన్ మంజూరు చేయాలని.. రైల్వే కోడూరు మండల సిపిఐ కార్యదర్శి దార్ల రాజశేఖర్ కోరారు. గురువారం రైల్వే కోడూరు పట్టణంలోని సమతా నగర్ కు చెందిన మల్లంపల్లి అంజనమ్మ కుమారుడు శ్రవణ్ కుమార్ పరిస్థితి తెలుసుకొని వారింటికి వెళ్లి సమాచారం సేకరించారు. ఏఎన్ఎం మంజుల వాణి బాలుడికి కావలసిన పత్రాలు సమకూర్చి పెన్షన్ కొరకు అప్లై చేయాలని ఆయన కోరారు.