భూ సమస్యల పరిష్కరానికి 'రెవెన్యూ సదస్సులు' అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. ఇందులో భాగంగా మేజర్ పంచాయితీ అయినా గోపాలపురంలోని సచివాలయం-1, 2, 3 పరిధిలో సోమవారం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు సచివాలయ సిబ్బంది, అధికారులకు మాత్రమే పరిమితమైంది. జనం లేక కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. సరైనా సమాచారం లేకపోవడంతో సదస్సుకు హాజరు కాలేదని పలువురు అంటున్నారు.