రాజమండ్రి: ఢిల్లీలో సత్తా చాటిన రాజమండ్రి అమ్మాయి

74చూసినవారు
రాజమండ్రి: ఢిల్లీలో సత్తా చాటిన రాజమండ్రి అమ్మాయి
రాజమండ్రిలో ఓ ప్రైవేట్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న కె. హేమశ్రీ ఢిల్లీలో జరిగిన జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటిల్లో సత్తా చాటిందని కోచ్ భాస్కర్ సోమవారం మీడియాకు తెలిపారు. 145 కిలోల బరువు ఎత్తి బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకుందని తెలిపారు. తండ్రి సత్యనారాయణ రాజమండ్రి కార్పొరేషన్‌లో శానిటేషన్ మేస్త్రిగా పని చేస్తున్నారని చెప్పారు. రాజమండ్రికి పేరు తీసుకొచ్చిన హేమశ్రీకి పలువురు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్