రాజమండ్రి: ఫీజురీయింబర్స్ మెంట్, వసతి దీవెన విడుదల చేయాలి

64చూసినవారు
డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ చదువుతున్న విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్, వసతి దీవెన నగదు విడుదల చేయాలని జిల్లా ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. సోమవారం రాజమండ్రిలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టి అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సి. హెచ్ సునీల్ మాట్లాడారు. ప్రభుత్వం స్పందించి ఫీజ్ రీయింబర్స్ మెంట్, వసతి దీవెన విడుదల చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్