తూ. గో జిల్లా కలెక్టరేట్ లో ఆధార్ నమోదు కేంద్రం

71చూసినవారు
తూ. గో జిల్లా కలెక్టరేట్ లో ఆధార్ నమోదు కేంద్రం
ప్రజల సౌకర్యార్థం ప్రతి సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు జిల్లా వ్యాప్తంగా వివిధ అర్జీలు అందజేసేందుకు వచ్చే ప్రజల కోసం ఆధార్ కేంద్రం నిర్వహించనున్నట్లు తూ. గో జిల్లా అభివృద్ది అధికారి పి. వీణా దేవి సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 102 గ్రామ సచివాలయాలలో ఆధార్ కిట్స్ అందుబాటులో ఉన్నాయని వివరించారు.

సంబంధిత పోస్ట్