అధికారులు నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో సమర్థవంతంగా పనితీరు ఉండాలని తూ. గో జిల్లా కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద డ్వామా, స్త్రీ శిశు సంక్షేమ, రెవెన్యూ భూ సంబంధ, పరిశ్రమల శాఖ ప్రగతి పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధిహామీ పని దినాలు లక్ష్యం సాధించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.