వరద సహాయక చర్యల్లో పోలీసులు పాల్గొనాలి : ఎస్పి

64చూసినవారు
వరద సహాయక చర్యల్లో పోలీసులు పాల్గొనాలి : ఎస్పి
కృష్ణా జిల్లా వ్యాప్తంగా వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజానీకానికి జిల్లాలోని పోలీసులు పూర్తి సహాయ సహకారాలు అందించాలని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్ రావు బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పరిసర ప్రాంతంలోని పోలీస్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే కార్యక్రమాల్లో పాల్గొనాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్