రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తాం: కలెక్టర్
ఈ నెల 23వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10: 30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్నీ ప్రభుత్వ కార్యాలయాల్లో మీ కోసం కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.