జగన్మోహన్ రెడ్డి చిత్రపటాలు దగ్ధం
తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో బాధ్యులు ఎంతటి వారైనా తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ కృష్ణాజిల్లా ప్రచార కార్యదర్శి పి. వి. ఫణికుమార్ డిమాండ్ చేశారు. లడ్డు కల్తీ చేసినందుకు నిరసనగా కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి సాక్షిగా హిందువుల మనోభావాలు దెబ్బతీసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటాలను మచిలీపట్నం 45వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం రోడ్డుపై వేసి దగ్ధం చేశారు.