రొయ్యూరులో బరి తెగించిన ఇసుక మాఫియా
తోట్లవల్లూరు మండలం రొయ్యూరు నుంచి రాత్రిళ్లు అడ్డగోలుగా ట్రాక్టర్లలో ఇసుక తోలకం జరుగుతోంది. మూడు మండలాలకు సరిహద్దు ప్రాంతం కావడంతో రొయ్యూరు క్వారీ నుంచి ఎక్కువగా దూరంగా, చొడవరం నుంచి స్థానికంగా ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం. మాముళ్ళ మత్తులో రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మరింతగా ఇసుక మాఫియా బరి తెగించి జోరుగా రవాణా చేస్తున్నట్లు సమాచారం.