గుడివాడలో వైరల్ అవుతున్న వైసిపి నేత సెల్ఫీ వీడియో
గుడివాడ నియోజకవర్గంలోని ప్రస్తుత వైసిపి రాజకీయాల్లో ఆ పార్టీ మైనారిటీ నేత సర్దార్ బేగ్ సెల్ఫీ వీడియో వైరల్ అవుతుంది. ఆదివారం సెల్ఫీ వీడియోలో ఆయన మాట్లాడుతూ పోలింగ్ రోజు కొడాలి నాని డబ్బులు ఇస్తే చాలామంది నాయకులు ఓటర్లకు డబ్బులు పంచకుండా తినేసారని అన్నారు. పట్టణంలో కష్టపడిన వైసీపీ నేతలకు ఎటువంటి న్యాయం చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైసిపి నేత సెల్ఫీ వీడియోపై తీవ్రంగా చర్చించుకుంటున్నారు.