గంపలగూడెం మండలం పెనుగొలను లో షిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో తిరువూరు ప్రాంతంలోని కవులు, రచయితలు, కళాకారులకు ఉగాది సందర్భంగా మార్చి 30న సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ ఏడాది జనవరి 17న, ఫిబ్రవరి 26న వివిధ రంగాలకు చెందిన కొంతమందిని సన్మానించారు. ఇతరులు కూడా పాల్గొనాలనుకుంటే 6281793313 నంబర్ కు సంప్రదించవచ్చని సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావుబుధవారం తెలిపారు.