ఏపీ టూరిజం ఇన్వెస్టర్స్ 'కాన్ఫరెన్స్-2024' ను మంగళవారం విజయవాడలో నిర్వహిస్తున్నామని మంత్రి కందుల దుర్గేశ్ సోమవారం తెలిపారు. వివంత హోటల లో రేపు జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికై చర్చిస్తామని మంత్రి దుర్గేశ్ తెలిపారు. పీపీపీ విధానంపై చేపట్టే ప్రాజెక్టులు, రాష్ట్రంలోని ఎమ్మెల్యే లు తమ ప్రాంతాలలో ప్రతిపాదించిన పలు పర్యాటక ప్రాజెక్టుల గురించి ఈ సమావేశంలో చర్చిస్తామన్నారు.