విజయవాడ 3వ డివిజన్ లోని మహానాడు రోడ్డు సమీపంలో నూతనంగా నిర్మించనున్న వాటర్ పైపులైన్ పనులకు తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గద్దె మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో పలు రహదారుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టామన్నారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి పక్షాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.