ఇది ప్రజల సంక్షేమ ప్రభుత్వం
ఆళ్లగడ్డ మున్సిపాలిటీ కార్యాలయంలో అధికారులు ఏర్పాటుచేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో బుధవారం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టి 100 రోజులు పూర్తయిందని, ఈ వందరోజుల కాలంలో తమ ప్రభుత్వం అందించిన పథకాలను ప్రజలకు వివరించారు. ఆళ్లగడ్డకు సంబంధించి మూడు అన్న క్యాంటీన్లను తెప్పించి పేదల ఆకలి తీరుస్తామన్నారు.