వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే వరకు పోరాడాలి
మహర్షి వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి (ఎంవీఆర్పిఎస్) రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వీజీఆర్ కొండయ్యను ఎమ్మిగనూరులో ఆయన ఫాంహౌస్ నందు బుధవారం పెద్దకడబూరు మండలంలోని కల్లుకుంట గ్రామ వాల్మీకులు కలిశారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని చేపట్టే ఉద్యమ ప్రణాళిక గురించి చర్చించారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే వరకు విశ్రమించకూడదని సూచించారు.