చిప్పగిరి రైతులకు ఏవో కీలక సూచనలు
ఒకే పంటను సాగు చేయకుండా వివిధ రకాల పంటలను సాగు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని చిప్పగిరి వ్యవసాయ శాఖ అధికారి జయలక్ష్మి రైతులకు సూచించారు. గురువారం చిప్పగిరి రైతు సేవ కేంద్రంలో ఆమె మాట్లాడారు. ఖరీఫ్ లో వేసిన పంటలకు గాను రైతులు ఇప్పటివరకు 6, 346 ఎకరాలకు ఈ క్రాప్ నమోదు చేయించుకున్నారన్నారు. పంట నమోదులో నంచర్ల గ్రామం వెనుకబడిందని, రైతులు చొరవ చూపి పంట నమోదును వేగవంతం చేసుకోవాలన్నారు.