అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు
అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని రౌడీషీటర్లను ఉద్దేశించి డి.ఎస్.పి రవికుమార్ పేర్కొన్నారు. ఆదివారం ఆళ్లగడ్డ సిరివెళ్ల మండల పోలీసు స్టేషన్ ఆవరణంలో ఆళ్లగడ్డ డి. ఎస్. పి రవికుమార్, సీఐ వంశీధర్, ఎస్సై బి. చిన్న పేరయ్య ఆధ్వర్యంలో రౌడీ షీటర్ లకు కౌన్సిలింగ్ చేశారు. సమాజంలో ప్రతి మనిషి గౌరవప్రదంగా జీవించాలని చెప్పారు. కొందరు చేసే తప్పులకు కుటుంబాలు నష్టపోతున్నాయని అన్నారు.