ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు
కర్నూలు జిల్లాలో హోళగుంద అయోధ్య నగర్ కాలనీలో ట్రాన్స్ ఫార్మర్ వద్ద విద్యుత్ స్తంభాలు పెచ్చులూడి ప్రమాదకరంగా మారాయి. కాలనీవాసులు, మూగజీవాలు సంచరించే ప్రదేశంలో విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారడంతో ఎప్పుడూ ఏ ప్రమాదం జరుగుతుందోనని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి స్తంభాలను మార్చాలని ఆదివారం వారు కోరారు.