స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకే చర్యలు: జిల్లా కలెక్టర్
కర్నూలు జిల్లాలోని అన్ని గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు జిల్లా వ్యాప్తంగా ఊరూరా స్వచ్ఛత హి సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పి. రంజిత్ బాషా బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కర్నూలులో వారు మాట్లాడారు. ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో అన్ని గ్రామాలలో ఒక్కోరోజు ఒక్కో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ వెల్లడించారు.