కూలిన వంతెన.. రాకపోకలు బంద్
రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలంలోని మాల్యం నుండి నాగేపల్లికి మధ్యన ఉన్న వంతెన కుప్పకూలింది. దీంతో ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శిథిలావస్థకు చేరుకున్న వంతెనల పునఃనిర్మాణంపై వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు పేర్కొంటున్నారు. మాల్యం నుండి నాగేపల్లికి రాకపోకలు బంద్ అయ్యాయి.