సూళ్లూరుపేట: ఆటోను ఢీకొన్న లారీ.. డ్రైవర్ మృతి
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఆర్టీసీ డిపో ఎదుట ఉన్న జాతీయ రహదారిపై శనివారం దొరవారిసత్రం నుంచి పలువురు కార్మికులతో సూళ్లూరుపేటకు వెళ్లుతున్న ఆటోను లారీ వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో దొరవారిసత్రం కు చెందిన ఆటో డ్రైవర్ మునిరాజ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆరు మంది కార్మికులు గాయపడ్డారు. గాయపడిన వారిని సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.