పంచాయతీరాజ్ వ్యవస్థను వైసిపి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది

61చూసినవారు
దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే పంచాయతీరాజ్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు విమర్శించారు. శుక్రవారం మాచవరం మండలం పిల్లుట్లలో జరిగిన గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాబోయే వందరోజుల్లో ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలన్నారు. గ్రామాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్