చీపురుపల్లి: రంగు మారిన త్రాగునీరు
గుర్ల మండలం కొండగండ్రేడు గ్రామంలో సోమవారం ప్రభుత్వ కొళాయిల ద్వారా సరఫరా చేస్తున్న త్రాగునీరు బురదమయమై రంగు మారింది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే డయేరియాతో 40 మంది చికిత్స పొందుతున్నారని, డయేరియాతో మరణాలు కూడా సంభవించాయని గ్రామస్తులు వాపోతున్నారు. క్లోరినేషన్ చేసి స్వచ్ఛమైన త్రాగునీరు ను సరఫరా చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.