చీపురుపల్లి: గుర్ల గ్రామంలో పర్యటించిన విజయానంద్
డయేరియా వ్యాధి ప్రభలడానికి కారణాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం నియమించిన సీనియర్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తో కలిసి మంగళవారం గుర్ల గ్రామంలో పర్యటించారు. పారిశుద్యాన్ని, త్రాగునీటి పైప్ లైన్లను క్షుణ్ణంగా పరిశీలించారు. నీటి సరఫరా గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గుర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు.