
భోగాపురం: అక్రమంగా ఇసు తరలిస్తున్న మూడు లారీలు సీజ్
శ్రీకాకుళం నుండి విశాఖపట్నంకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు లారీలను భోగాపురం జాతీయ రహదారిపై మైనింగ్ అధికారులు పట్టుకున్నారు. తమకు అందిన సమాచారం మేరకు శుక్రవారం రాత్రి తనిఖీలు నిర్వహించగా డూప్లికేట్ బిల్లులతో ఇసుక తరలిస్తున్న మూడు లారీలు పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. పట్టుబడిన మూడు లారీలను భోగాపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.