ముండ్లమూరు మండలంలోని మారెళ్ళ రెవెన్యూలోని గంగన పాలెం పేదలకు ప్రభుత్వ భూమిని పంపిణీ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు వెల్లంపల్లి ఆంజనేయులు డిమాండ్ చేశారు. ఆదివారం 18 ఎకరాల ప్రభుత్వ భూమిలో చెట్లు కొట్టి అక్కడ ఎర్రజెండాలు పాతారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూములు పెత్తందారులు ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.