మార్కాపురం: ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు
ప్రకాశం జిల్లా మార్కాపురంలో బుధవారం ముమ్మరంగా పోలీసులు డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. మద్యం తాగి వాహనం నడుపుతున్న వాహనదారుల వాహనాలను సీజ్ చేశారు. అలానే మద్యం తాగి వాహనం నడుపుతున్న వాహనదారులపై కేసు నమోదు చేశారు. మద్యం తాగి వాహనం నడిపితే భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని వాహనదారులను పోలీసులు తీవ్రంగా హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు పోలీసులకు సహకరించాలన్నారు.