పొదిలి: టిప్పర్ లారీకి భారీ జరిమానా
ప్రకాశం జిల్లా పొదిలిలో పరిమితికి మించి ఇసుకను తరలిస్తున్న టిప్పర్ లారీకి ఆర్టీవో అధికారి షాక్ ఇచ్చారు. వాహన తనిఖీలలో భాగంగా అధిక మొత్తంలో ఇసుకను తరలిస్తున్న టిప్పర్ లారీని గుర్తించిన ఆర్టీవో రవికుమార్ టిప్పర్ లారీకి రూ. 55 వేలు జరిమానా వేశారు. 28 టన్నులు మాత్రమే టిప్పర్ లారీలో ఇసుక తరలించవలసి ఉండగా 43 టన్నుల వరకు ఇసుకను తరలిస్తున్నట్లుగా రవికుమార్ మీడియాకు బుధవారం తెలిపారు.