ప్రకాశం జిల్లా మార్కాపురంలో సోమవారం స్థానిక డిఎస్పి నాగరాజు ఆధ్వర్యంలో.. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గోడపత్రికలను ఆవిష్కరించి ఆటో ర్యాలీ చేపట్టారు. అపరిచిత వ్యక్తులను నమ్మి మీ వ్యక్తిగత బ్యాంకు ఖాతా, ఓటీపీ నెంబర్లు చెప్పవద్దని సూచించారు. సోషల్ మీడియాలో మీ వ్యక్తిగత సమాచారాన్ని కూడా పంచుకోవద్దని తెలిపారు. సైబర్ నేరగాళ్లు పంపించే లింకులతో జాగ్రత్తగా ఉండాలన్నారు.