వర్షాలతో నీటి సంఘాల ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వాయిదా పడినట్లు మార్కాపురం తహశీల్దార్ చిరంజీవి మీడియాకు బుధవారం వెల్లడించారు. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియలు పూర్తి చేశామని చెప్పారు. ఎన్నికలు జరిగే కొత్త తేదీలను ప్రభుత్వం త్వరలో ప్రకటిస్తుందని అన్నారు. అలానే డిసెంబర్ 6వ తేదీ నుంచి 2025 జనవరి 8వ తేదీ వరకు మండలంలోని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.