భామిని: ఐటీడీఏ ద్వారా చేప పిల్లల పంపిణీ
భామిని మండలంలోని బురుజోల, కొత్తగూడ, జకరగోడ, మండ్రుం గూడ, పెద్దదిమిలి గ్రామాలలోని 12 చెరువుల్లో వదులుటకు ఐటీడీఏ ద్వారా ఉచితంగా 40, 300 చేప పిల్లను మంగళవారం పంపిణీ చేశారు. చెరువులో చేప పిల్లల పెంపకంలో సరైన పద్ధతులు అవలంబిస్తే మంచి లాభాలను పొందవచ్చు అని విలేజ్ ఫెసరీస్ అసిస్టెంట్ ఆదినారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలిష్ కోట సర్పంచ్ బిడ్డకి నారాయణరావు ఉన్నారు.