భామిని: గిరిజన కో-ఆపరేటివ్ సంస్థకు సహకరించాలి
భామిని మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో గిరిజన కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సంస్థ డైరెక్టర్ పిరపాక శ్రీనివాసరావు సోమవారం జడ్పీటీసీ, వైస్ ఎంపీపీలతో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు గిరిజన కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సంస్థ ద్వారా మండలంలో చేపట్టబోయే కార్యక్రమాల విషయంలో మండల నాయకులు సహకరించాలని శ్రీనివాసరావు కోరారు. ఈ క్రమంలో ఎంపీటీసీలు, సర్పంచ్ లు ,మండల నాయకులు శ్రీనివాసరావును సత్కరించారు.