వీరఘట్టం: విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండాలి
వీరఘట్టం మండల కేంద్రంలోని జెడ్పి హెచ్ పాఠశాల వద్ద బుధవారం అగ్ని ప్రమాదాలు, వంట గ్యాస్ ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు నిర్వహించారు. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్లో బ్యూటేన్, ప్రోపేన్, ఇథైల్ మెర్కాప్టాన్ వంటి రసాయనాలు ఉంటాయని, గ్యాస్ సిలిండర్ నిలువగా ఉంచడం, గ్యాస్ స్టవ్ ఎత్తులో ఉండాలని సూచించారు.