కురుపాం: ట్రాక్టర్ - బైక్ ఢీ.. ఒకరికి గాయాలు
మన్యం జిల్లా పాలకొండ మండలం యరకరాయపురం సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును ట్రాక్టర్ ఢీకొనడంతో బైకుపై వెళ్తున్న యువకుడు కైలాసు కు గాయాలయ్యాయి. హుటాహుటిన పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై ప్రయోగ మూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.