నగరి: అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా: రోజా
అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు నగరి మాజీ మంత్రి రోజా" ఎక్స్ " ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ఆమె శనివారం నగరిలో మాట్లాడుతూ ఏ చిత్రానికైనా నటీనటులు ప్రమోషన్ కు వెళ్లడం సహజమన్నారు. అలాగే అల్లు అర్జున్ కూడా తన చిత్రం పుష్ప -2 ప్రమోషన్ కోసం వెళ్లారన్నారు. ఇందులో తప్పేముందని ఆమె ప్రశ్నించారు. హీరో వస్తున్నారని ముందుగా సమాచారం ఇచ్చినప్పుడు భద్రత కల్పించాలన్నారు.