పుంగనూరు: బోయకొండ గంగమ్మ ఆలయంలో లక్ష కుంకుమార్చన

58చూసినవారు
పుంగనూరు: బోయకొండ గంగమ్మ ఆలయంలో లక్ష కుంకుమార్చన
పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో ఫిబ్రవరి 19 నుండి 21 వరకు టీటీడీ ఆధ్వర్యంలో లక్ష కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈఓ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునేవారు రూ. 1500 చెల్లించాలని చెప్పారు. పూజ అనంతరం ఉభయదారులకు 12 రకాల వస్తువులను దేవస్థానం వారు అందజేస్తారని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్