ఉదయగిరి: పోలీసులను ఆశ్రయించిన యువకుడు
ఉదయగిరి పట్టణం శ్రీనగర్ కాలనీ చెందిన పూసలాపురం మల్లికార్జున బుధవారం ఉదయగిరి పోలీసులను ఆశ్రయించారు. స్మాల్ క్రెడిట్ లోన్ యాప్ ద్వారా మల్లికార్జున రూ. 2, 500 రుణం పొంది తిరిగి వడ్డీతో సకాలంలో రూ. 3500 చెల్లించారు. స్మాల్ క్రెడిట్ లోన్ యాప్ వారు రుణం మొత్తం చెల్లించినట్లు మెసేజ్ ద్వారా సమాచారం అందించారన్నారు. అయినప్పటికీ ఆ యాప్ కు సంబంధం లేని వ్యక్తి ఫోన్ ద్వారా రుణం చెల్లించాలని వేధిస్తున్నారన్నారు.